MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్, 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "మాచర్ల నియోజకవర్గం". ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న విడుదలవడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాలోని "రా రా రెడ్డి ...ఐయామ్ రెడీ " అనే మాస్ మసాలా పాట ఇటీవలే విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అన్నిరకాల షార్ట్ వీడియో యాప్స్ లో 500+ మిలియన్ వీక్షణలు రాబట్టిన ఈ పాటకు విదేశీయులు సైతం స్టెప్స్ వేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ పాటకు ఇండియన్ క్రికెటర్ యజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ కళ్ళు చెదిరే స్టప్స్ వేసి సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రొఫెషనల్ గా డాక్టర్ అయినప్పటికీ ధనశ్రీ ఫేమస్ యూట్యూబర్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa