మంచు విష్ణు నటిస్తున్న కొత్త చిత్రం "జిన్నా". ఇషాన్ సూర్య దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు 'గాలి నాగేశ్వరరావు' పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి సన్నీ లియోన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. 'రేణుక' గా సన్నీలియోన్ అల్ట్రా మోడరన్ లుక్ లో అదరగొడుతుంది. AVA ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో మంచు విష్ణు కూతుళ్లు అరియనా, వివియానా అఫీషియల్ సినీ ఎంట్రీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa