తమన్నా... ఇటు సౌత్, అటు నార్త్ ...రెండు సినీ పరిశ్రమల్లోనూ మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. ప్రేక్షకుల్లో తమన్నాకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. తమన్నా మంచి నటి మాత్రమే కాక అద్భుతమైన డాన్సర్ కూడా... ఈ విషయం అందరికి తెలిసిందే.
లేటెస్ట్ గా తమన్నా బాలీవుడ్ డాన్స్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. అదికూడా ఆషామాషీ ప్రోగ్రాం కాదు. ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో భాగంగా ఫిజి, ఆస్ట్రేలియా, న్యూ జీలాండ్ ఇలా ప్రపంచవ్యాప్త కంటెస్టెంట్లు పాల్గొనే షోకు తమన్నా న్యాయనిర్ణేతగా వ్యవహరించడం అంటే మాటలు కాదు. పోస్ట్ పాండెమిక్ ఈ ప్రోగ్రాం ఆగస్టు 12-20 వరకు చాలా గ్రాండ్ గా ఫీజికల్ గా జరగబోతుంది. తమన్నాకు తోడుగా మిస్ ఆస్ట్రేలియా క్రిస్టెన్ రైట్ కూడా జడ్జ్ గా వ్యవహరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa