ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 11 నుండి అమెజాన్ ప్రైమ్ లో 'థాంక్యూ' మూవీ స్ట్రీమింగ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 10, 2022, 10:51 AM

నాగ చైతన్య నటించిన 'థాంక్యూ' మూవీ అప్పుడే ఓటీటీ బాట పట్టింది. గత నెల 22న రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టడంతో మూడు వారాల్లోనే ఓటీటీ ప్రీమియర్స్ కు సిద్ధమైంది. ఈ నెల 11 నుంచి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ కానుంది. ప్రత్యేకమైన స్టోరీ లైన్ తో మిమ్మల్ని సంతోషాల సముద్రంలో ముంచెత్తడానికి వాళ్లు వచ్చేస్తున్నారు అంటూ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌ను ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. చైతూకి జంటగా రాశీఖన్నా నటించింది. జీవితంలో మనం ఎదగడానికి సాయపడిన వాళ్లను గుర్తుంచు కొని, వాళ్లకు కృతజ్ఞత చూపాల్సిన అవసరాన్ని ఈ సినిమా చూపించింది. అయితే కథ-కథనాలు గ్రిప్పింగ్ గా సాగకపోవడంతో ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. ఇటీవల కాలంలో థియేటర్స్ లో ఆడని కొన్ని సినిమాలు ఓటీటీలో అదరగొట్టడం చూశాం. #ThankYou కూడా ఈ జాబితాలో చేరుతుందేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa