ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైత్రి సంస్థలో హను రాఘవపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్?

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 05:45 PM

"అందాల రాక్షసి" తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ హను రాఘవపూడి ఆ సినిమాతో సెన్సిటివ్ లవ్ స్టోరీల డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. తదుపరి నాచురల్ స్టార్ నానితో "కృష్ణగాడి వీర ప్రేమగాథ" తీసి, బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. నితిన్ "లై", శర్వానంద్ "పడి పడి లేచే మనసు" మూవీలతో డిజాస్టర్లందుకున్న హను నాలుగేళ్ళ విరామం తీసుకుని చేసిన చిత్రం "సీతారామం". దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మండన్నా,సుమంత్, భూమిక, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి భారీ స్టార్ క్యాస్టింగ్, వైజయంతీ మూవీస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది. 
రీసెంట్ మీడియా ఇంటిరాక్షన్ లో హను సీతారామం తదుపరి బాలీవుడ్ ప్రాజెక్ట్ అంతకన్నా ముందు ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వెబ్ సిరీస్ లను ఫిక్స్ చేసుకున్నానని తెలిపాడు హను. అలానే, ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి ఒక సినిమాను చెయ్యబోతున్నట్టు, ఇందులో స్టార్ హీరో నటించబోతున్నట్టు, ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa