ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగా హీరోనా ...నందమూరి హీరోనా - ఉప్పెన డైరెక్టర్ కన్ఫ్యూషన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 05:38 PM

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కు తొలి సినిమానే వంద కోట్ల సినిమాగా, గ్రాండ్ డిబట్ అందించిన క్రెడిట్ ఆ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానాకే దక్కుతుంది. విశేషమేంటంటే, ఇదే బుచ్చిబాబుకు కూడా తొలి సినిమా. సుకుమార్ ప్రియ శిష్యుడిగా, ఆయన అడుగుజాడలలో నడుస్తున్న బుచ్చిబాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఫిక్స్ చేసుకున్నాడని, అది స్పోర్ట్స్ డ్రామా అని, టైటిల్ "పెద్ది" అని  గతంలో చాలా రకాల పుకార్లు నడిచాయి. RRR తరవాత తారక్ ఎన్టీఆర్ 30, ఎన్టీఆర్ 31 మూవీ ఎనౌన్స్మెంట్లను చేసాడు కానీ, బుచ్చిబాబు సినిమాపై చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. దీంతో, ఇక ఈ సినిమా ఉండదని అంతా అనుకున్నారు.
లేటెస్ట్ గా బుచ్చిబాబుతో తారక్ తప్పకుండా సినిమా చేస్తానని మాట ఇచ్చాడని ఫిలిం నగర్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. అలానే బుచ్చిబాబు తన నెక్స్ట్ మూవీ స్టోరీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇటీవలే వినిపించి, ఆయన నుండి ఫైనల్ స్క్రిప్ట్ ను రెడీ చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట. చెర్రీ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆపై గౌతమ్ తిన్ననూరి రెడీగా ఉన్నాడు. అంటే, వచ్చే ఏడాది పూర్తిగా చెర్రీ లాక్ అయిపోయి ఉన్నాడు. అటు తారక్ పరిస్థితి అంతే. కొరటాల, ప్రశాంత్ నీల్ ల సినిమాలు పూర్తవ్వాలంటే 2024 రావాల్సిందే. ఈ ఇద్దరూ కూడా ఒకే సమయానికి ఫ్రీ అవ్వనున్నారు. దీంతో ఇద్దరిలో ఎవరి ప్రాజెక్ట్ టేకప్ చెయ్యాలని బుచ్చిబాబు అయోమయ స్థితిలో పడిపోయాడట. ప్రస్తుతానికైతే, చెర్రీ ఓకే చేసిన స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నాడట. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa