ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బింబిసార' OTT విడుదల పై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 04:12 PM

మల్లిడి వశిస్ట్ దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన 'బింబిసార' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో కేథరిన్ త్రెసా అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని జీ5 భారీ మొత్తానికి సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజగా ఇప్పుడు ఈ సినిమాని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా సక్సెస్ మీట్‌లో 50 రోజుల థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల కానుంది అని స్పష్టం చేశారు. బింబిసార సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందించారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె హరి కృష్ణ నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa