ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్ స్టార్ కు మెగాస్టార్ స్పెషల్ బర్త్ డే విషెస్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 12:58 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ రోజు 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. గత వారంలో వెకేషన్ ముగించుకుని హైదరాబాద్ కు తిరిగొచ్చిన మహేష్ అండ్ ఫ్యామిలీ ఇక్కడే మహేష్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ను జరుపుకోనున్నారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, పలువురు సినీ సెలెబ్రిటీలు, కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నారు.
లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తూ, స్పెషల్ ట్వీట్ చేసారు. "ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తిని, సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ" మహేష్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa