హను రాఘవపూడి డైరెక్షన్లో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన చిత్రం "సీతారామం". శుక్రవారం విడుదలైన ఈ చిత్రం "బింబిసార" కు ధీటుగా కలెక్షన్లను రాబడుతూ, పాజిటివ్ మౌత్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది.
లేటెస్ట్ గా ఈ సినిమాను చూసిన టాలీవుడ్ రొమాంటిక్ లవ్ చిత్రాల కథానాయకుడు నాగార్జున, ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని ట్వీట్ రూపంలో తెలియచేసారు. ముందుగా ఈ సినిమాను విజువల్ గా రిచ్ గా తెరకెక్కించిన నిర్మాతలు అశ్వినీదత్, స్వప్న లను నాగార్జున స్పెషల్ గా అభినందించారు. ఈ సినిమాను చూసినప్పుడు నాగార్జునకు నోస్టాల్జిక్ ఫీలింగ్ కలిగిందని, చాలా మంచిగా అనిపించిందని చెప్పారు. అలానే మూవీ టీం మొత్తానికి శుభాకాంక్షలను తెలియచేసారు. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అభినందనలను తెలియచేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa