ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు మహేష్ బర్త్ డే ... SSMB 28 టీం స్పెషల్ విషెస్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 10:49 AM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఈ రోజు. నేటితో మహేష్ 47వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మహేష్ నటిస్తున్న కొత్త చిత్రం SSMB 28 నుండి స్పెషల్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను నిర్మిస్తున్న హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో "షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నామంటూ", మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ప్రస్తుతమైతే, ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ తో రాబోతున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa