ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరశురామ్ - చైతుల మూవీ .... మరో గీతాగోవిందమా?

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 05:03 PM

పరశురామ్ డైరెక్షన్లో గీతా ఆర్ట్స్ నిర్మించిన చిత్రం "గీతగోవిందం". 2018లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమా విజయ్ దేవరకొండ, రష్మిక మండన్నా లకు టాలీవుడ్ లో తిరుగులేని గుర్తింపునిచ్చింది.
మహేష్ బాబుతో "సర్కారువారిపాట" తదుపరి పరశురామ్ నాగచైతన్యతో సినిమా కమిట్ ఐన విషయం తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, పరశురామ్ ఇటీవలే నాగచైతన్యను కలిసి ఒక ఇంటరెస్టింగ్ స్టోరీని వినిపించి, చైతు చేత ఓకే అనిపించుకున్నాడట. అలానే, ఈ సినిమాలో రష్మిక మండన్నా ను హీరోయిన్ గా తీసుకుందామని ప్రొపోజ్ చేసాడట. చైతు సరసన రష్మిక అంటే ఈ సినిమాకు పాన్ ఇండియా రీచ్ ఉంటుందని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారట.  పరశురామ్, రష్మిక కాంబోలో వచ్చిన గీతాగోవిందం సినిమాలాగే ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa