ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న చిత్రం "తీస్మార్ ఖాన్". కళ్యాన్జీ గోగన డైరెక్షన్లో పక్కా యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 19వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పంచారు. గత వారంలో ఈ సినిమాలో కీలకపాత్రను పోషిస్తున్న సునీల్ , పూర్ణ రోల్స్ ను రివీల్ చేసిన మేకర్స్ లేటెస్ట్ గా మరొక ఇంపార్టెంట్ రోల్ ను ప్రేక్షకులకు పరిచయం చేసారు.
అనూప్ ఠాకూర్ సింగ్ "జిజా" అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలిపి, ఆ పాత్ర యొక్క పోస్టర్ ను రిలీజ్ చేసారు. అనూప్ ఠాకూర్ తెలుగులో విన్నర్, రోగ్, ఖిలాడీ, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి చిత్రాలలో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa