ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాలీవుడ్ నిర్మాతలకు షాకిచ్చిన నాచురల్ స్టార్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 03, 2022, 06:26 PM

స్టార్ హీరోల భారీ రెమ్యునరేషన్ పై పలు ఇబ్బందులను వ్యక్తం చేసిన టాలీవుడ్ నిర్మాతలు ఆగస్టు ఒకటవ తేదీ నుండి సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే కదా.
విచిత్రంగా, తెలుగు నిర్మాతల సంఘంలో ఎంతో యాక్టివ్ గా ఉండే ప్రముఖ సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు మాత్రం సమ్మెను  పాటించకుండా, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో చెయ్యబోయే మూవీ షూటింగ్ ను ఎలాంటి ఆటంకం కలగకుండా ఆఘమేఘాల మీద కానిస్తున్న విషయం కూడా తెలిసిందే.
లేటెస్ట్ గా దిల్ రాజు బాటలోనే మరో ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి కూడా నానితో నిర్మిస్తున్న "దసరా" షూటింగును ప్రారంభించాలని చూస్తున్నాడట. వచ్చే సోమవారం నుండి జరగబోయే షెడ్యూల్ లో పాల్గొనటానికి నాని కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.  ఇలా పెద్ద నిర్మాతలందరూ తమ సినిమాల షూటింగులను స్టార్ట్ చేస్తే,  ఇతర నిర్మాతలు, దర్శకులు కూడా తమ సినిమాల షూటింగులను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఇలా ఐతే , నిర్మాతల కష్టనష్టాలు తీరేదెప్పుడో !!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa