ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"విక్రాంత్ రోణ" డిజిటల్ పార్టనర్ ఖరారు..?

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 05:45 PM

కన్నడ సూపర్ స్టార్ కిచ్ఛా సుదీప్ కొత్త చిత్రం విక్రాంత్ రోణ. అనూప్ భండారీ దర్శకత్వంలో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. సుదీప్ తో పాటు ఈ సినిమాలో నిరూప్ భండారీ, నీతా అశోక్ ప్రధాన పాత్రలు పోషించారు. 3D లో ప్రపంచవ్యాప్తంగా జూలై 28వ తేదీన విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ ఖరారైనట్టు తెలుస్తుంది. ప్రముఖ జీ 5 ఓటిటి విక్రాంత్ రోణ హక్కులను భారీ ధరకు కొనుక్కుందట. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి, ఇప్పటి నుండి ఇంకా 4-8వారాల తర్వాతే ఈ సినిమా ఓటిటిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐతే, ఈ విషయంలో తుది నిర్ణయం మేకర్స్ మరియు సదరు ఓటిటి సంస్థదే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa