చందు మొండేటి డైరెక్షన్లో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం "కార్తికేయ 2". ఈ చిత్రంలో బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం లేటెస్ట్ గా సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది.
సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ఎలాంటి కోతను విధించకుండా, U/A సెర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ రివ్యూ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేసింది. ఒక్క తెలుగులోనే కాక మిగిలిన భాషల్లో కూడా కార్తికేయ ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa