ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడకు విచ్చేస్తున్న "సీతారామం" టీం... ఎప్పుడంటే?

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 04:22 PM

"సీతారామం" హీరో హీరోయిన్లు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ విజయవాడ రాబోతున్నారని కొంచెంసేపటి క్రితమే మేకర్స్ స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసారు. జూలై 31, మధ్యాహ్నం రెండింటికి విజయవాడలోని పీవీపీ మాల్ లో సీతారాములని కలవొచ్చని మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ వినూత్నంగా, ముమ్మరంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అందులో భాగమే విజయవాడ ఈవెంట్.
హను రాఘవపూడి డైరెక్షన్లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో రష్మిక మండన్నా, సుమంత్, భూమిక, మురళీశర్మ, తరుణ్ భాస్కర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ ఈ సినిమాను నిర్మిస్తుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఆగస్టు 5న ఈ సినిమా విడుదలకాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa