ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శంకర్ రెండు పడవల ప్రయాణం నిజమేనా?

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 03:06 PM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. పలు కీలక షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. కానీ, అనుకోకుండా ఈ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక, ఆగస్టు 1 నుండి టాలీవుడ్లో నిర్మాతల సమ్మె మొదలు కాబోతుంది. దీంతో ఈ మూవీ షూటింగ్ కు లాంగ్ బ్రేక్ పడింది. ఈ ఏడాది చివరికల్లా పూర్తి కావలసిన షూటింగ్ పూర్తవుతుందో లేదో అని అభిమానులు ఖంగారు పడుతున్నారు. వీరి ఖంగారు లేటెస్ట్ న్యూస్ తో మరింత ఎక్కువైంది. అదేంటంటే, కమల్ హాసన్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ "ఇండియన్ 2" త్వరలోనే అదికూడా సెప్టెంబర్ నుండే మొదలు కాబోతుందని తమిళనాట ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే, శంకర్ ఒకేసారి రెండు బిగ్ ప్రాజెక్ట్ ల షూటింగ్ ను పూర్తి చెయ్యాల్సిన పరిస్థితి. ఇలా ఐతే, శంకర్ డబుల్ ప్రెజర్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఆ రెండు సినిమాల ఔట్ పుట్ లో తేడా వచ్చే అవకాశాలున్నాయి. ఈ విషయమే చెర్రీ అభిమానులను నిరాశపరుస్తుంది.
ఎందుకంటే, ఆల్రెడీ RRR వంటి ఘనవిజయం తదుపరి ఆచార్య చేసి చెయ్యి కాల్చుకున్న చెర్రీ ఈ సినిమాపై పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. రామ్ చరణ్ RRR రేంజ్ హిట్ కొట్టాలని అభిమానులు ఎదురుచూస్తుంటే, శంకర్ సడెన్ షెడ్యూల్ చేంజెస్ వారి గుండెల్లో గుబులు రేపుతోంది. ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది. ఇక అప్పటివరకు ఈ సస్పెన్స్ తప్పదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa