టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ హిట్ సినిమా 'వినోదయ సీతం' రీమేక్ చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడని ఫిలిం ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. సముద్రకని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా జులై 12 నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుంది అని సమాచారం. ఈ సినిమా కోసం స్టార్ యాక్టర్ కేవలం 20 రోజులు మాత్రమే వర్క్ చేయనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ క్యారెక్టరైజేషన్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది అని లేటెస్ట్ టాక్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ZEE5తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa