కన్నడ మూవీస్ లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'విక్రాంత్ రోనా' సినిమా ఒకటి. అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ మూవీ 5 భాషల్లో జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలోని 'లాలీ' అనే టైటిల్ తో రానున్న రెండవ సింగిల్ ని జూలై 2న విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని మొదటి సింగిల్ రా రా రక్కమ్మ ఇప్పటికే ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలతో పాటు ఇంగ్లీషులో కూడా సినిమా విడుదలవుతోంది. నిరూప్ భండారి, నీతా అశోక్ అండ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ భారీ బడ్జెట్ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌కి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa