ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుదైన ఘనతను సాధించిన 'భూల్ భూలయ్యా 2'

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 01, 2022, 04:05 PM

అనీస్ బాజ్మీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన 'భూల్ భూలయ్యా 2' సినిమా మే 20, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కార్తీక్ సరసన బ్యూటీ క్వీన్ కియారా అద్వానీ జంటగా నటిస్తుంది. ఈ సినిమా భూల్ భూలయ్యా (2007)కి సీక్వెల్, ఇది చంద్రముఖికి రీమేక్. ఈ సినిమా ఇప్పటివరకు బాక్స్ఆఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూలు చేసింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ నాన్ ఇంగ్లీష్ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని కార్తీక్ ఆర్యన్ ట్విట్టర్ లో ప్రకటించారు. ఈ సినిమాలో టబు, రాజ్‌పాల్ యాదవ్ అండ్ సంజయ్ మిశ్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి-సిరీస్ అండ్ సినీ 1 స్టూడియోస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, మురాద్ ఖేతాని, అంజుమ్ ఖేతాని అండ్ క్రిషన్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa