పోల్ చుట్టూ తిరుగుతూ చేసే పోల్ డ్యాన్స్ అంటే ఇష్టపడే వాళ్లు ఎంతో మంది. కానీ చేసే వాళ్లు చాలా తక్కువ మంది. అందుకు ఎవరైనా పోల్ డ్యాన్స్ చేస్తుంటే కళ్లు తిప్పకుండా చూస్తూ ఉండిపోతాం. బాలీవుడ్ మంచి పోల్ డ్యాన్సర్ గా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు పేరుంది. మూడు నెలలుగా ఆమె కఠిన శిక్షణ తీసుకుంటోంది. త్వరలో ఆమె పోల్ డ్యాన్స్ మనం కూడా చూడచ్చు.
జాక్వెలిన్ సమయం దొరికితే చాలు సోషల్ మీడియలో ఏవో ఒక పోస్టులు పెడుతూనే ఉంటుంది. అలా తన పోల్ డ్యాన్స్ గురించి కూడా ఏదో పోస్టులు పెట్టింది. అలాగే ఆమె పోల్ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు కూడా పోస్టు చేసింది. వాటిని నెటిజన్లతో పాటూ బాలీవుడ్ జనాలు కూడా చూశారు. అబ్బబ్బా ఏం చేసింది పిల్లా అని తెగ మెచ్చుకున్నారు. ప్రస్తుతం జాక్వెలిన్ - సల్మాన్ ఖాన్ కలిసి రేస్ 3లో నటిస్తున్నారు. ఈ సినిమాకు రెమో డి సౌజా దర్శకత్వం వహిస్తున్నారు. జాక్వెలిన్ చేసిన పోల్ డ్యాన్స్ అతడికి బాగా నచ్చేసింది. అందుకే రేస్ 3లో ఆమె పోల్ డ్యాన్స్ ను పెడుతున్నారు. అందుకోసం ఓ సీన్నో - పాటనో కొత్తగా క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ పోల్ డ్యాన్స్ ని సినిమా ప్రమోషన్ కు వాడేసుకుంటారట దర్శక నిర్మాతలు.
జాక్వెలిన్ - సల్మాన్ ఖాన్ కలిసి గతంలో కిక్2 లో నటించారు. ఇది వారికి రెండో సినిమా. ఈ ఏడాది ఈద్ కానుకగా సినిమా విడుదల కానుంది.
Hang on people!! 2018 is gonna be a crazy one! Thank you @dabbooratnani & @manishadratnani for another awesome #dabbooratnanicalendar shoot!! https://t.co/TCwlZXQzCF pic.twitter.com/S2m3iZiifg
— Jacqueline Fernandez (@Asli_Jacqueline) January 22, 2018
‘Yogini’ with @lanaroxy https://t.co/sQCtfbIjDO pic.twitter.com/JJbJ7co5SW
— Jacqueline Fernandez (@Asli_Jacqueline) November 19, 2017
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa