మొన్న జూబ్లీ హిల్స్ లో జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో స్వల్పంగా గాయపడిన నాని ఎలా ఉన్నాడు అనే దాని గురించి అభిమానుల్లో ఇంకా ఆందోళన తగ్గలేదు. నేను బాగున్నాను జస్ట్ ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు అని నాని స్వయంగా ట్వీట్ చేసినప్పటికీ నేరుగా కనిపిస్తే తప్ప ఫాన్స్ కుదుటపడలేరు. ఆ సస్పెన్స్ ఈ రోజు సాయంత్రం వీగిపోతుంది. నాని నిర్మించిన అ!! సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇవాళ జరగబోతోంది. నిర్మాత స్వయంగా నానినే కాబట్టి తనే హోస్ట్ గా చేయాలనీ గతంలోనే డిసైడ్ అయ్యాడు. కాని అనుకోకుండా ఈ ప్రమాదం జరగడంతో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు జరిగే ఈవెంట్ లో కనక నాని ఫుల్ ఎనర్జీ తో వ్యాఖ్యతగా ఉంటే ఏ సమస్యా లేనట్టే. ఒకవేళ తను చూడటం వరకే పరిమితమైతే మాత్రం గాయం మాననట్టే అనుకోవాలి.
ఈ ఫంక్షన్ కు ఒక స్టార్ హీరోతో పాటు మరో క్రేజీ హీరొయిన్ కూడా గెస్ట్ గా రావొచ్చని టాక్. తెలిసిన సమాచారం మేరకు ఇందులో వాయిస్ ఓవర్ ఇచ్చిన రవి తేజ భాగమతి అనుష్క రావొచ్చు అని తెలిసింది. నాని తనకు స్వీటీతో ఎంత మంచి రిలేషన్ ఉందో భాగమతి వేడుకలో ప్రత్యేకంగా చెప్పిన సంగతి తెల్సిందే. ఇప్పుడు బదులుగా స్నేహ ధర్మం పాటించాలి కాబట్టి అనుష్క రావొచ్చు అనే అంచనాలు ఉన్నాయి. ఇక ఇందులో నటించిన కాజల్ నిత్య మీనన్ రెజినాలతో పాటు టీం మొత్తం పాల్గోనబోతోంది.
నాని నార్మల్ గా కనిపిస్తే షూటింగ్ బ్రేక్ పడిన కృష్ణార్జున యుద్ధం కూడా కంటిన్యూ అయిపోతుంది. అ!! సక్సెస్ మీద నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కాని నిర్మాతగా ఇది తన మొదటి సినిమా కాదు. భాగస్వామ్యంలో గతంలో డి ఫర్ దోపిడీ నిర్మించాడు కాని అది డిజాస్టర్ అయ్యింది. చాలా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ రూపొందిన ఈ అ!! కనక సక్సెస్ అయితే తన హోం బ్యానర్ మీద ఇకపై వరసగా సినిమాలు చేసే ప్లాన్ లో ఉన్నాడు న్యాచురల్ స్టార్.
Theatrical Trailer will be launched at the Pre Release Event on Jan 31st. The event will be telecast on all the Telugu channels and our YouTube channel! #AWEPreReleaseEventon31st #AWEReleaseOnFEB16th pic.twitter.com/E8RnCIAbxH
— Wall Poster Cinema (@walpostercinema) January 29, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa