రవితేజ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 'అమర్ అక్బర్ ఆంటోని' పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో రవితేజ మూడు పాత్రల్లో సందడి చేయనున్నారని సమాచారమ్. ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకు స్థానముండగా.. వారిలో ఒకరిగా కేరళకుట్టి నివేథా థామస్ ఎంపికైందని తెలిసింది. అన్నట్టు.. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన 'జై లవ కుశ'లోనూ నివేథా ఓ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే నివేథా ఎంపికపై క్లారిటీ వస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa