అటు బాలీవుడ్ ఇటు శాండల్వుడ్ లో మంచి స్నేహితుల్ని సంపాదించుకున్నతారక్ బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్.. కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో కేజీఎఫ్ 2 షూటింగులో బిజీగా ఉన్నఆ ఇద్దరినీ వ్యక్తిగతంగా ఇంటికి పిలిచి స్పెషల్ డిన్నర్ పార్టీ ఎరేంజ్ చేశాడట. ఈ పార్టీలో ఇంతకుముందెన్నడూ చూడని స్పెషల్ ఐటెమ్స్ ని రెడీ చేశారట. ఈ ఆతిధ్యానికి ఆ ఇద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారని తెలుస్తోంది. తారక్ పిలవగానే ఇంటికి వచ్చారట. ఇక యంగ్ హీరో యశ్ మాత్రం తారక్ ని ఎప్పుడెప్పుడు కలవాలా అనుకున్నాడట. మొత్తానికి నేరుగా ఇంటి వద్దనే తనని కలిసే అవకాశం దొరికింది. ఆ ముగ్గురూ డిన్నర్ పార్టీలో స్పెషల్ వంటకాల్ని ఆరగించి చాలా సమయం వెచ్చించి సినిమాల గురించి చాలా చాలా కబుర్లు ఆడుకున్నారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa