ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు రామ్ చరణ్ 'పెద్ది' టీజర్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 26, 2026, 12:34 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవల రామ్ చరణ్ కంటి సమీపంలో స్వల్ప గాయపడినప్పటికీ, ఆయన త్వరలోనే తిరిగి సెట్లలో పాల్గొననున్నారు. ఇక రేపు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11:07 గంటలకు 'పెద్ది' టీజర్ విడుదల కానుంది. ఈ టీజర్ 'కుస్తీ' పేరుతో రాబోతోంది, ఇందులో కుస్తీకి సంబంధించిన సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.టీజర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో అన్నది ఆసక్తిగా మారింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటులు శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యాంధు తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa