భారతీయ చలనచిత్ర రంగంలో విశిష్ట సేవలందించిన నందమూరి బాలకృష్ణకు ప్రతిష్టాత్మక ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు దక్కింది. దిల్లీలోని ‘భారత్ మండపం’లో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ (IFFD) 2026’ వేడుకల్లో సీఎం రేఖాగుప్తా చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేశారు. బాలయ్యతో పాటు ప్రముఖ అలనాటి నటి షర్మిలా ఠాగూర్, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్ర (ఆయన తరఫున కుటుంబసభ్యులు)ను కూడా జీవితకాల సాఫల్య పురస్కారాలతో గౌరవించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa