ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 14న సూర్య 'కరుప్పు' విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 20, 2026, 11:26 AM

సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న చిత్రం ‘కరుప్పు’. గురువారం ఉగాది సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సమ్మర్ స్పెషల్‌గా మే 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో సూర్య ఇంటెన్స్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa