ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమాల్లోని అశ్లీలతపై ఎంపీ రవి కిషన్ ఆగ్రహం

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 18, 2026, 11:48 AM

సినిమాల్లో పెరుగుతున్న అశ్లీలతపై బాలీవుడ్ నటుడు, గోరఖ్‌పూర్ ఎంపీ రవి కిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల 'KD: The Devil' చిత్రంలోని 'సర్కే చునార్' పాటలో మహిళలను కించపరిచే సాహిత్యంపై ఆయన స్పందిస్తూ, సంస్కృతిని, విలువలను దెబ్బతీసే అశ్లీలతను ప్రజలు ప్రోత్సహించకూడదన్నారు. కేవలం హైప్ కోసమో, వ్యూస్ కోసమో అసభ్యకరమైన అంశాలను చొప్పించడం సరికాదని, కంటెంట్ బాగుంటే అశ్లీలత లేకుండానే వేల కోట్ల వసూళ్లు సాధిస్తున్న సినిమాలను ఉదాహరణగా తీసుకోవాలని ఆయన హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa