సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై కొంతకాలంగా సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్, అసభ్యకర పోస్టులు వస్తున్నాయి. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు, ఈ కేసులో ఏపీలోని కడప జిల్లా పులివెందులకు చెందిన జనార్దన్‌ను నిందితుడిగా గుర్తించారు. ప్రస్తుతం గచ్చిబౌలిలో నివసిస్తున్న అతడు, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అనసూయ నకిలీ వీడియోలను తయారు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa