ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ-రిలీజ్ వేడుక.. అభిమానులకు భారీ పండగ!

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 02:51 PM

 హైదరాబాద్‌లోని యుసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో మార్చి 15, ఆదివారం సాయంత్రం 5 గంటలకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ వేడుక జరగనుంది. పవన్ కళ్యాణ్, ప్రధాన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరుకానున్న ఈ వేడుకను మైత్రీ మూవీ మేకర్స్ అభిమానులకు పండగలా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా స్పెషల్ ట్రైలర్ విడుదల చేసే ఆలోచనలో టీమ్ ఉంది. కాగా, మార్చి 19న ఉగాది కానుకగా సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.మైత్రీ మూవీ మేకర్స్ ఈ కార్యక్రమాన్ని కేవలం ఒక ఈవెంట్‌లా కాకుండా, మెగా అభిమానులకు ఒక భారీ పండగలా ఉండేలా భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఈ గ్రౌండ్స్‌లో స్టేజ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన సాంగ్ టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన ఎనర్జిటిక్ మ్యూజిక్ కు ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగం తోడైతే ఇక అంచనాలు మామూలుగా ఉండవు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa