ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్ ప్రైమ్ లో నారీ నారీ నడుమ మురారి

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 31, 2026, 08:20 AM

సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై మంచి విజయం అందుకున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘నారీ నారీ నడుమ మురారి’ మూవీ ఓటీటీ విడుదలకు మూహూర్తం ఖరారైంది. ఈ మూవీ ఫిబ్రవరి 4 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. జనవరి 14న సంక్రాంతి బరిలోకి చివరిగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న యువకుడిగా శర్వానంద్‌ నటన ఆకట్టుకోగా, హీరోయిన్లుగా సాక్షి వైద్య, సంయుక్త తమ పాత్రల్లో మెప్పించారు. నరేశ్‌, సత్య, సునీల్‌, వెన్నెల కిశోర్‌ తమదైన శైలిలో కామెడీతో అలరించారు. దర్శకుడు రామ్ అబ్బరాజు వినోదాత్మక కథలను తెరకెక్కించడంలో తన ప్రత్యేకతను మరోసారి నిరూపించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa