బాలీవుడ్‌పై ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలపై రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పందించారు. ఏఆర్ రెహమాన్ భారత్‌లో అత్యంత ప్రసిద్ధుడు, సంపన్న సంగీత దర్శకుడని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తులకు మతం లేదా సామాజిక నేపథ్యం కారణంగా ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, జావెద్ అక్తర్ వంటి వారు సూపర్ స్టార్లేనని గుర్తు చేశారు. కష్టాలు పేదలకే ఎదురవుతాయని, రెహమాన్‌ను చూసి జాలిపడటం తగదని తస్లీమా నస్రీన్ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa