టాలీవుడ్ నటుడు, దర్శకుడు రవిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కెరీర్ లో కీలకమైన 'సోగ్గాడు' సినిమా గురించి మాట్లాడుతూ, ఈ సినిమాను రూ. 2.75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించామని, అయితే అగ్రతారలైన తరుణ్, ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్‌లతో చేయాలనుకున్నా, ఉదయ్ కిరణ్ చివరి నిమిషంలో సినిమా చేయడానికి నిరాకరించడంతో, అతని స్థానంలో హిందీ నటుడు జుగల్ హన్స్‌రాజ్‌ను తీసుకున్నామని తెలిపారు. ఈ నిర్ణయమే సినిమా ప్లాప్ అవ్వడానికి కారణమని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa