రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన 'దురంధర్' సినిమాకి ఆదిత్య ధార్ దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి రోజు నుంచే భారీ వసూళ్లను రాబడుతూ దూసుకెళుతోంది. ఇండియాలో 700 కోట్లకి పైగా నెట్ వసూళ్లను రాబట్టిన తొలి బాలీవుడ్ సినిమాగా ఒక అరుదైన రికార్డును ఈ సినిమా సొంతం చేసుకుంది.యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, 24 రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. ఇంతకుముందు కొన్ని సినిమాలు నమోదు చేసిన రికార్డులను ఒక్కొక్కటిగా దాటుకుంటూ వెళుతోంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కూడా ఒక అరుదైన ఘనతను దక్కించుకుంది. బాలీవుడ్ లో ఇంతవరకూ భారీ వసూళ్లను సాధించిన సినిమాల జాబితాలో 7వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa