టాలీవుడ్‌లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఎంపికైనట్లు సమాచారం. అయితే తాజాగా ఐశ్వర్య రాజేష్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవబోతున్నారని టాక్. గతంలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించగా వారి కెమిస్ట్రీ బాగా నచ్చడంతో త్రివిక్రమ్ మళ్ళీ ఈ జంటను తెరపై చూపించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa