మాస్ మహరాజా రవితేజ నటించిన ‘మాస్ జాతర’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అక్టోబర్ 28న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రవితేజ కెరీర్‌లో 75వ చిత్రమైన ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa