నటుడు సిద్ధు జొన్నలగడ్డ 'జాక్' సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో బాధపడి, రూ.4.75 కోట్లు అప్పు చేసి నిర్మాతలకు తిరిగి ఇచ్చేశానని తెలిపారు. తన చేతిలో డబ్బులు లేకపోయినా, సినిమాతో నష్టపోయిన వారిని చూసి అలా చేశానని, ఇప్పుడు ఆ అప్పు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్నానని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'డిజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న సిద్ధు, 'జాక్' ఫలితం తనను నిరాశపరిచిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన 'తెలుసు కదా' సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa