మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై 9 నెలల క్రితం ప్రారంభమైన సెంట్రల్ లైటింగ్ పనులు ఆగిపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్ధాంతరంగా సెంట్రల్ లైటింగ్ పనులు ఆగిపోవడంతో వాహనాలు వెళుతున్న క్రమంలో వచ్చే దుమ్ము దూళితో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, భారీ వాహనాలు వెళ్ళేటప్పుడు చిన్న చిన్న రాళ్లు తగిలి పాదాచారులు ప్రమాదాలకు గురవుతున్నారని, అర్ధాంతరంగా ఆగిపోయిన రోడ్డు పనులు ప్రారంభించి రోడ్డు పూర్తి చేయాలని ఆందోళన చేశారు. సంఘటన స్థలానికి గిరిదావర్ రత్తయ్య, స్థానిక పోలీసులు వచ్చి తహశీల్దార్ కు సమాచారం ఇవ్వగా, సంబంధిత శాఖ డిఈ తో మాట్లాడించి త్వరగా పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు వెంకట్ దొర, రామకృష్ణ,లక్ష్మి,బాలాజీ, ఈశ్వర్, ప్రకాష్, వెంకటేష్, తదితరులు ఉన్నారు.
సూర్య ప్రతినిధి, అన్నపరెడ్డిపల్లి, చందు