☼ Suryaa News
🔴 క్రీడలు చారిత్రక టీ20 మ్యాచ్ మంగళవారం సెప్టెంబరు 22న
క్రీడలు

చారిత్రక టీ20 మ్యాచ్ మంగళవారం సెప్టెంబరు 22న

20 Sep 2026 Hareesh
భారత్, జపాన్ జట్ల మధ్య చారిత్రక టీ20 మ్యాచ్ మంగళవారం సెప్టెంబరు 22న జరగనుంది. భారత్-జపాన్ దౌత్య సంబంధాల 75 వసంతాల వేడుకల్లో భాగంగా, ఇరు దేశాల ప్రధానుల స్థాయి చర్చల ఫలితంగా ఈ సుజుకి కప్ మ్యాచ్ హఠాత్తుగా ఖరారైంది. టోచిగి ప్రిఫెక్చర్‌లోని సానో అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే అన్ని టికెట్లు అమ్ముడయ్యాయి.ప్రపంచ ఛాంపియన్ అయిన టీమిండియాతో తలపడటం తమకు దక్కిన అద్భుతమైన, ఊహించని అవకాశమని జపాన్ హెడ్ కోచ్ డుగాల్ బెడింగ్‌ఫీల్డ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ పోటీ ద్వారా జపాన్‌లో భవిష్యత్ తరాల పిల్లలకు స్ఫూర్తినిచ్చి, అక్కడ క్రికెట్ ఆటకు విస్తృత ప్రాచుర్యం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశాడు.ఆసియా క్రీడలకు ముందు ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలక సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఆసియా క్రీడల్లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లో ఆడనుండగా, జపాన్ తమ తొలి పోరులో ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది.
Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home