☼ Suryaa News
🔴 క్రీడలు ఆర్చరీ ప్రపంచ కప్‌ గెలిచిన ధీరజ్
క్రీడలు

ఆర్చరీ ప్రపంచ కప్‌ గెలిచిన ధీరజ్

14 Sep 2026 vasu

సాల్టిల్లో: ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర చారిత్రాత్మక విజయం సాధించి, ఈ టైటిల్ గెలుచుకున్న తొలి భారత పురుషుడిగా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల రికర్వ్ ఫైనల్లో జపాన్‌కు చెందిన నకానిషి జున్యాను ఉత్కంఠభరితమైన షూట్-ఆఫ్‌లో ఓడించి ఆయన స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

ఐదు సెట్ల ముగిసేసరికి ఇరు ఆటగాళ్ల స్కోర్లు 5-5తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయించడానికి షూట్-ఆఫ్ నిర్వహించారు. ఇందులో ధీరజ్ పర్ఫెక్ట్ 10 పాయింట్లు సాధించగా, నకానిషి 9 పాయింట్లకే పరిమితమయ్యాడు. దీంతో 6-5 తేడాతో విజయం ధీరజ్‌ను వరించింది. 2007లో డోలా బానర్జీ తర్వాత ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌కు వ్యక్తిగత స్వర్ణం లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home