☼ Suryaa News
🔴 క్రీడలు భారత్‌కు సాధారణ ఆరంభం.. 2700 రేటింగ్ దిగువకు పడిపోయిన గుకేష్
క్రీడలు

భారత్‌కు సాధారణ ఆరంభం.. 2700 రేటింగ్ దిగువకు పడిపోయిన గుకేష్

18 Sep 2026 vasu

చెన్నై: 46వ చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత పురుషుల జట్టు సాధారణ ఆరంభాన్ని చవిచూసింది. మొదటి రెండు రౌండ్లలో విజయం సాధించినప్పటికీ, ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేదు. కాగా, ప్రపంచ ఛాంపియన్ డి. గుకేష్ రెండో రౌండ్‌లో ఇండోనేషియాకు చెందిన సత్రియ దుతా కహాయాతో మ్యాచ్‌ను 'డ్రా' చేసుకోవడంతో ఆయన లైవ్ రేటింగ్స్ 2700 మార్కు దిగువకు (2699.5) పడిపోయాయి. గత రెండు ఒలింపియాడ్లలో స్వర్ణం గెలిచిన గుకేష్, ఫామ్‌ ఆధారంగా ఈసారి నాలుగో బోర్డుకు మారడం గమనార్హం.

మొదటి రౌండ్‌లో థాయిలాండ్‌పై 3-1తో, రెండో రౌండ్‌లో ఇండోనేషియాపై 2.5-1.5 తేడాతో భారత్ విజయం సాధించింది. మూడో రౌండ్‌లో భారత్ బలమైన ఇటలీ జట్టుతో (ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి, నిహాల్ సరిన్, గుకేష్) తలపడనుంది.

మరోవైపు భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతోంది. మొదటి రౌండ్‌లో డొమినికన్ రిపబ్లిక్‌పై 4-0తో, రెండో రౌండ్‌లో ఫిన్లాండ్‌పై 3.5-0.5 తేడాతో ఘనవిజయాలు సాధించింది. మూడో రౌండ్‌లో కోనేరు హంపీ నేతృత్వంలోని భారత మహిళల జట్టు గ్రీస్‌తో పోటీపడనుంది. 11 రౌండ్ల పాటు సాగే ఈ టోర్నీలో ప్రతి విజయానికి రెండు మ్యాచ్ పాయింట్లు లభిస్తాయి.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home