సూర్య జాతీయ డెస్క్: ఆసియా క్రీడలు 2026 లో భాగంగా పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్ హీట్స్‌లో భారత అథ్లెట్ రిషబ్ దాస్ అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఆయన 54.85 సెకన్ల టైమింగ్‌తో రేసును పూర్తి చేసి ఓవరాల్‌గా ఐదో స్థానంలో నిలవడంతో పాటు ఫైనల్‌కు అర్హత సాధించారు.
ఇదే ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్ ఉత్కర్ష్ సంతోష్ పాటిల్ 56.19 సెకన్ల సమయంతో రేసును ముగించి ఓవరాల్‌గా 12వ స్థానాన్ని దక్కించుకున్నారు. దీనిద్వారా ఆయనను ఈ పోటీలకు రిజర్వ్‌గా ఉంచడం జరిగింది. అంతర్జాతీయ వేదికపై భారత ఈతగాళ్లు ప్రదర్శిస్తున్న ఈ ప్రతిభ క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
క్రీడలు