☼ Suryaa News
🔴 జాతీయం ప్రిన్స్ రహీం అగా ఖాన్ V పర్యటన
జాతీయం

ప్రిన్స్ రహీం అగా ఖాన్ V పర్యటన

11 Sep 2026 vasu

రాష్ట్రపతి ముర్ము, హోం మంత్రి అమిత్ షాతో భేటీ
న్యూఢిల్లీ: అగా ఖాన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి భారతదేశ అధికారిక పర్యటనకు విచ్చేసిన ప్రిన్స్ రహీం అగా ఖాన్ V, గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో వేర్వేరుగా సమావేశమయ్యారు.

రాష్ట్రపతి భవన్‌లో ప్రిన్స్ రహీం అగా ఖాన్‌కు ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన తండ్రి, దివంగత అగా ఖాన్ IV మరణానికి సంతాపం తెలిపారు. నీరు, పారిశుధ్యం, విద్య, ప్రసూతి ఆరోగ్యం, పట్టణ పునరాభివృద్ధి, మహిళా సాధికారత, ఉపాధి కల్పన వంటి రంగాల్లో అగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ (AKDN) అందిస్తున్న సేవలను ఆమె ప్రశంసించారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి (PPP) ఈ సంస్థ సేవలు నిదర్శనమని పేర్కొన్నారు.

అనంతరం హోం మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో సామాజిక అభివృద్ధి, నీటిపారుదల, సహకార సంఘాలు, చిరుధాన్యాల సహజ వ్యవసాయం మరియు సౌరశక్తి రంగాలలో సహకారాన్ని పెంచడంపై చర్చలు జరిగాయి. సుస్థిర అభివృద్ధి కోసం ఈ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామని అమిత్ షా పునరుద్ఘాటించారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home