☼ Suryaa News
🔴 జాతీయం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా భూటాన్‌లో జైశంకర్ పర్యటన
జాతీయం

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా భూటాన్‌లో జైశంకర్ పర్యటన

16 Sep 2026 vasu

న్యూఢిల్లీ:భారత్, భూటాన్ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరియు ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పటిష్టం చేసేందుకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ సెప్టెంబర్ 16-17 తేదీలలో భూటాన్‌లో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భూటాన్ విదేశాంగ మంత్రి లియోన్‌పో డి.ఎన్. ధుంగ్యెల్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు, భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యెల్ వాంగ్‌చుక్, ప్రధాని షెరింగ్ తోబ్‌గేలతో భేటీ కానున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది.

ఇరుదేశాల మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల సంప్రదాయంలో భాగంగా ఈ పర్యటన సాగుతోందని MEA పేర్కొంది. ప్రస్తుతం భారత్-భూటాన్‌లు అనేక సామాజిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా పనిచేస్తున్నాయి. భూటాన్ మొత్తం వాణిజ్యంలో 80 శాతం వాటాతో భారత్ ప్రధాన భాగస్వామిగా కొనసాగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 46 శాతానికి పైగా వృద్ధితో 1.9 బిలియన్ డాలర్లను దాటడం విశేషం.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home