☼ Suryaa News
🔴 జాతీయం డీయూఎస్‌యూ ఎన్నికల నామినేషన్లు
జాతీయం

డీయూఎస్‌యూ ఎన్నికల నామినేషన్లు

09 Sep 2026 vasu

నార్త్ క్యాంపస్‌లో ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ
న్యూఢిల్లీ: రాబోయే ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో నార్త్ క్యాంపస్ పరిధిలో సెప్టెంబర్ 10, 11 తేదీలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు వర్సిటీ యంత్రాంగం ప్రకటించింది. ఈ మేరకు ఛాత్రా మార్గ్, ప్రోబైన్ రోడ్, యూనివర్సిటీ రోడ్, జి.సి. నారంగ్ మార్గ్‌లలో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ అడ్వైజరీ జారీ చేశారు. అంతేకాకుండా, నార్త్ క్యాంపస్ గేట్ నెం. 4 ను ఈ రెండు రోజులు పూర్తిగా మూసివేయనున్నారు.

ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకు చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 11 మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. డీయూఎస్‌యూ ఎన్నికల పోలింగ్ సెప్టెంబర్ 18న నిర్వహించనుండగా, మరుసటి రోజైన సెప్టెంబర్ 19న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
జాతీయం

ఇంజినీరింగ్ విద్యార్థులు సరిహద్దులు దాటి ఆలోచించాలి.. మిజోరం గవర్నర్ పిలుపు

🕑 20 Sep 2026
జాతీయం

పెరియార్ నాస్తిక విధానాలు, బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతాలను తీవ్రంగా తోసిపుచ్చిన అన్నామలై

🕑 20 Sep 2026
జాతీయం

అసోంలో అదానీ పవర్ మెగా ప్రాజెక్ట్: రూ.48,000 కోట్ల పవర్ ప్లాంట్‌కు సీఎం హిమంత బిశ్వ శర్మ శంకుస్థాపన

🕑 20 Sep 2026
జాతీయం

భారత గడ్డపై జపాన్ యుద్ధ విమానాల గర్జన: వీర్ గార్డియన్ కసరత్తును ప్రశంసించిన ఎయిర్ చీఫ్

🕑 20 Sep 2026
జాతీయం

ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. పోలీసుల కాల్పుల్లో వాంటెడ్ డ్రగ్ పెడ్లర్‌కు తీవ్ర గాయాలు

🕑 20 Sep 2026
జాతీయం

కర్బన ఉద్గారాలపై అభివృద్ధి చెందుతున్న దేశాలనే నిందించడం తగదు: ప్రధాని మోదీ

🕑 20 Sep 2026
Advertisement
↗ Full Article ← Home