☼ Suryaa News
🔴 జాతీయం యూపీ తొలి ముఖ్యమంత్రి గోవింద్ బల్లభ్ పంత్ జయంతి
జాతీయం

యూపీ తొలి ముఖ్యమంత్రి గోవింద్ బల్లభ్ పంత్ జయంతి

10 Sep 2026 vasu

నివాళులర్పించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
లక్నో:ఉత్తరప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, భారత రత్న పండిట్ గోవింద్ బల్లభ్ పంత్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ఆయనకు భావోద్వేగ నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంతో పాటు పరిపాలన, సామాజిక సంస్కరణలు మరియు భూ సంస్కరణలలో పంత్ అందించిన సేవలను ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో న్యాయవాదిగా, నాయకుడిగా పంత్ కీలక పాత్ర పోషించారని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 1925 కాకోరి రైలు ఘటన కేకస్ లో విప్లవకారుల తరఫున ఆయన గట్టిగా వాదించారని, 1937లో యూపీ ప్రీమియర్‌గా ఉన్నప్పటికీ క్విట్ ఇండియా ఉద్యమం కోసం తన పదవికి రాజీనామా చేసి పోరాటంలోకి దిగారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యానంతరం 1950 నుండి 1954 వరకు యూపీ తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని సుపరిపాలనకు నమూనాగా తీర్చిదిద్దారని కొనియాడారు. అనంతరం 1955 నుండి కేంద్ర హోం మంత్రిగా సేవలందిస్తూ భాషా వివాదాలను పరిష్కరించడంతో పాటు హిందీని అధికారిక భాషగా స్థిరపరచడంలో ముఖ్యభూమిక పోషించారని సీఎం తెలిపారు.

Advertisement
సంబంధిత వార్తలు
జాతీయం

పెరియార్ నాస్తిక విధానాలు, బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతాలను తీవ్రంగా తోసిపుచ్చిన అన్నామలై

🕑 20 Sep 2026
జాతీయం

అసోంలో అదానీ పవర్ మెగా ప్రాజెక్ట్: రూ.48,000 కోట్ల పవర్ ప్లాంట్‌కు సీఎం హిమంత బిశ్వ శర్మ శంకుస్థాపన

🕑 20 Sep 2026
జాతీయం

భారత గడ్డపై జపాన్ యుద్ధ విమానాల గర్జన: వీర్ గార్డియన్ కసరత్తును ప్రశంసించిన ఎయిర్ చీఫ్

🕑 20 Sep 2026
జాతీయం

ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. పోలీసుల కాల్పుల్లో వాంటెడ్ డ్రగ్ పెడ్లర్‌కు తీవ్ర గాయాలు

🕑 20 Sep 2026
జాతీయం

కర్బన ఉద్గారాలపై అభివృద్ధి చెందుతున్న దేశాలనే నిందించడం తగదు: ప్రధాని మోదీ

🕑 20 Sep 2026
జాతీయం

లక్నో రైల్వే డివిజన్‌లో కవచ్ 4.0కు ₹252 కోట్లు ఆమోదం

🕑 20 Sep 2026
Advertisement
↗ Full Article ← Home