☼ Suryaa News
🔴 అంతర్జాతీయం అమెరికాతో ఒప్పందానికి ఇరాన్ ఆసక్తి: ట్రంప్
అంతర్జాతీయం

అమెరికాతో ఒప్పందానికి ఇరాన్ ఆసక్తి: ట్రంప్

14 Sep 2026 vasu

వాషింగ్టన్:మధ్యప్రాచ్యంలో ఘర్షణలు తీవ్రమై ప్రపంచ చమురు సరఫరాకు విఘాతం కలుగుతున్న వేళ, అమెరికాతో ఒప్పందానికి ఇరాన్ ఆసక్తి చూపుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ పతనమవుతున్న వేళ అత్యవసరంగా ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని, ఇందులో పాల్గొనే అంశంపై అమెరికా త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

మరొకవైపు, సౌదీ అరేబియాలోని ఖమీస్ ముషైత్ సైనిక స్థావరంపై యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడ్డారు. సౌదీ వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ దాడి చేసినట్లు ప్రకటించారు. హోర్ముజ్ జలసంధి దిగ్బంధం మరియు తాజా దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడు చమురు ధరలు 4 ശాతానికి పైగా పెరిగాయి.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home