????సెప్టెంబర్ 19న ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.
????సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు విడుదలవుతాయి.
????అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటా విడుదల కానుంది.
????సెప్టెంబర్ 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి దర్శన కోటా విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదలవుతాయి.
????సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల కానుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
????????????????????????????????????????????????