☼ Suryaa News
🔴 సినిమా దిగ్గజ నటుడు అనంత్ నాగ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం.. అరుదైన గౌరవం!
సినిమా

దిగ్గజ నటుడు అనంత్ నాగ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం.. అరుదైన గౌరవం!

16 Sep 2026 Sravani

ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించనుంది. 2024 సంవత్సరానికి గాను ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు.

భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటుడు అనంత్ నాగ్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. దశాబ్దాలుగా నటనారంగంలో కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన పాత్రలతో అలరించిన ఆయనకు ఈ పురస్కారం దక్కడం పట్ల సినీ సర్కిల్స్‌లో హర్షం వ్యక్తమవుతోంది.

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసిన అనంత్ నాగ్ కేవలం కన్నడ చిత్రాలకే పరిమితం కాలేదు. తెలుగు, హిందీ, తమిళం, మరాళీ, మలయాళం మరియు ఇంగ్లీష్ భాషల్లో మొత్తం 300కు పైగా చిత్రాల్లో నటించి తన నటనా ప్రతిభను చాటుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులే. 'ప్రేమ లేఖలు' (1977), 'భీష్మ', సంచలనం సృష్టించిన 'కేజీఎఫ్' చిత్రాలతో పాటు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'రాత్రి' వంటి పలు చిత్రాల్లో నటించి తెలుగులోనూ తనదైన ముద్ర వేసుకున్నారు.

చలనచిత్ర రంగంలో ఆయన చేసిన సేవలకు సంబంధించి గతంలోనూ పలు పురస్కారాలు వరించాయి. గమనర్హం ఏంటంటే, ఇటీవల 2025 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో సత్కరించింది. ఇప్పుడు తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించడంతో ఆయన కెరీర్‌లో మరో అపూర్వ మైలురాయి చేరినట్లయింది. ఈ పురస్కార ప్రకటన పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home