☼ Suryaa News
🔴 సినిమా దీపావళి బరిలో లేడీ సూపర్ స్టార్ ‘మూకుత్తి అమ్మన్-2’.. పండుగ సందడి మరింత క్యూట్!
సినిమా

దీపావళి బరిలో లేడీ సూపర్ స్టార్ ‘మూకుత్తి అమ్మన్-2’.. పండుగ సందడి మరింత క్యూట్!

08 Sep 2026 Sravani

టాలీవుడ్, కోలీవుడ్‌లో తనదైన నటనతో లేడీ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మూకుత్తి అమ్మన్-2’. గతంలో ఘన విజయం సాధించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ‘మూకుత్తి అమ్మన్’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా వస్తోంది. తెలుగులో ఈ చిత్రం ‘మహాశక్తి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో నయనతార మరోసారి శక్తివంతమైన దేవత పాత్రలో కనిపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు.

అన్ని హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణాన్ని మరింత పెంచేలా ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా దీపావళి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. సీనియర్ దర్శకుడు సుందర్.సి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, దునియా విజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ దీపావళి రేసులో నిలవనుండటంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.  

Advertisement
సంబంధిత వార్తలు
సినిమా

సందీప్ కిషన్ సిగ్మా ట్రైలర్ విడుదల.. స్టైలిష్ యాక్షన్‌తో అదరగొట్టిన హీరో

🕑 18 Sep 2026
సినిమా

2027 ఆస్కార్స్ పోటీలో మరాఠీ చిత్రం ‘గొంధల్’

🕑 18 Sep 2026
సినిమా

ది ప్యారడైజ్ లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు.. బెంగళూరు ప్రెస్ మీట్‌లో నాని ఆసక్తికర వ్యాఖ్యలు

🕑 18 Sep 2026
సినిమా

ప్రేమలు ఫేమ్ భావన స్టూడియోస్ నుంచి కొత్త సినిమా పిక్నిక్.. ఫస్ట్ లుక్ విడుదల మరియు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్

🕑 18 Sep 2026
సినిమా

జీ5లో ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఆక్టోపస్.. ఆకట్టుకునే రహస్యాల కథనం

🕑 18 Sep 2026
సినిమా

జైలర్ 2 సినిమాలో సూరజ్ వెంజరమూడు పవర్‌ఫుల్ రోల్.. రజినీకాంత్ చిత్రంలో కీలక పాత్ర రివీల్

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home